27 July, 2026 | 5:01 PM

గోహత్యను పూర్తిగా నిషేధించి అమలు పరచాలి

27-07-2026 04:14 PM

మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): గోహత్యను పూర్తిగా నిషేధించి అమలుపరచాలని గవ్యసిద్ధ వైద్యుడు గుర్రం నర్సింగ్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికు వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న గౌ సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ( గౌ ఆరాధన ఉద్యమ ఆహ్వానం) లో భాగంగా గవ్యసిద్ధ వైద్యుడు గుర్రం నర్సింగ్ రావు జిల్లా కలెక్టర్ గారి ద్వారా  రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రిలకు గౌమాతను దేశమాతగా ప్రకటించి గౌహత్యను పూర్తిగా నిషేధించి అమలుపరచాలని, మద్దతుదారుల సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రమును జిల్లా డిప్యూటీ కలెక్టర్ కి అందజేయడం జరిగింది.