27 July, 2026 | 4:45 PM

హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్.. తొలగించాలని హైకోర్టు ఆదేశం

27-07-2026 04:13 PM
  1. హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు
  2. 63 కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ఆగ్రహం
  3. వరస వివాదాలతో హైకోర్టు కీలక నిర్ణయం
  4. వీరంగం చాలంటూ తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్: HYDRAA (హైడ్రా) చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ఏ.వీ. రంగనాథ్‌ను(HYDRA Commissioner) ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో తగిన అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని(Chief Secretary of Telangana) ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి సంబంధించిన వ్యవహారంలో సదరు అధికారి సమర్పించిన క్షమాపణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఈ ఆదేశం వెలువడింది. ఒక సీనియర్ అధికారి ఏకంగా 63 కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కోవడం సముచితం కాదని పేర్కొంటూ, కోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయమూర్తి అనిల్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేస్తూ, నిబంధనలను పాటించేలా చూడాలని HYDRAA కి అధిపతిగా ఒక కొత్త అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.