12 March, 2026 | 11:40 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మహిళా కమిషన్ చీఫ్‌గా శారద

18-07-2024 12:41 AM

నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు సీతక్క, ఉత్తమ్

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ళ శారద గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బుద్ధభవన్ కార్యాలయంలో బుధవారం ఆమె కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అంనతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలి పారు.

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు కృషి చేస్తానన్నారు. మహిళా కమిషన్ సమీక్ష అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శారదకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శారద చేసిన సేవలను జాతీయ నాయకత్వం గుర్తించి బాధ్యతలు అప్పగించిందని, మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అద్భుతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.