24 June, 2026 | 1:25 AM

16% పడిపోయిన ‘స్పేస్ షేర్లు

24-06-2026 12:19 AM

సంస్థ ఏఐ పెట్టుబడులపై మదుపర్ల ఆందోళన

ఒక్కరోజులోనే భారీగా షేర్ల విక్రయం

న్యూయార్క్, జూన్ ౨౩: స్పేస్‌ఎక్స్ ఐపీవో ఆనందం నీటిబుడగలా మారింది. నిన్నమొన్నటి వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మని పడిపోయాయి. ఐపీవో ప్రారంభ ధర నుంచి సుమారు 70 శాతం మేర పెరిగిన ఈ షేర్లు మూడు రోజుల్లోనే లాభాలన్నింటినీ సంస్థ కోల్పోయింది. మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ రుణ సమీకరణకు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు.

దీంతో సోమవారం ఒక్కరోజే మదుపర్లు 16 శాతం వాటాలను విక్రయించారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. కంపెనీ లిస్టింగ్ అయిన మొదటి రోజు తర్వాత ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ తన భారీ ఏఐ ప్రాజెక్టులను విస్తరించేందుకు 20 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని ఐపీవో ప్రకటించగా, పెట్టుబడి వ్యయం పెరిగి లాభాలపై ప్రభావం పడుతుందనే భయంతోనే మదుపర్లు భారీ షేర్లు విక్రయించినట్లు నిపుణులు చెబుతున్నారు.