14 July, 2026 | 5:34 PM

శశిథరూర్.. కేరళలో ధర్నా చేసుకోవచ్చు

05-12-2024 02:33 AM

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: తిరువనంతపురంలో రైల్వే ప్రాజెక్టు నిర్మా ణానికి భూ సేకరణ కోసం అవసరమైతే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేరళలో ధర్నా చేసుకోవచ్చని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తన నియోజక వర్గమైన తిరువనంతపురంలో నెమామ్ రైల్వే టెర్మినల్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం, నిధుల కొరతపై శశథరూర్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి వైష్ణవ్ పైవిధంగా సమాధానం ఇచ్చారు.

పెద్ద నగరాలు, జంక్షన్లలో రద్దీని తగ్గించడం, కొత్త టెర్మినల్స్ నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిందని, రాబోయే 50 ఏండ్లలో డిమాండ్, అవసరాలను తీర్చేలా డిజైన్ల రూపకల్పనను కేంద్రం చేస్తోందని ఆయన వెల్లడించారు. కేరళలో పనుల కోసం నిధు ల సమస్య లేదని, ఇప్పటికే భూ సేకరణ కోసం రూ.2,150 కోట్లు డిపా జిట్ చేసినట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్నాకు దిగాలని థరూర్‌ను వైష్ణవ్ కోరారు.