14 July, 2026 | 4:51 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయ్?

05-12-2024 02:27 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రైతుల సమస్యలపై ఎందుకు చర్చలు జరపడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ ప్రశ్నించారు. గతంలో వాళ్లకు ఇచ్చిన హామీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. ముంబై వేదికగా జరిగిన సీఐఆర్‌సీఓటీ శతాబ్ది ఉత్సవాల్లో శివరాజ్ సింగ్‌తో కలిసి ధన్‌ఖర్ పాల్గొన్నారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరి ంచారు.

వాళ్ల గొంతును ఏ శక్తీ కూడా అణచివేయలేదనే విషయా న్ని గుర్తుంచుకోవాలన్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు వాళ్లతో చర్చలు జరపడం లేదో తనకు అర్థం కావట్లేదన్నారు. “గతంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వాళ్లు రైతుల సమస్యలు పరిష్కరిం చడానికి రాతపూర్వక హామీ ఇచ్చా రా? ఒకవేళ ఇస్తే ఆ హామీ నెరవేర్చ డానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?” అని శివరాజ్ సింగ్‌ను ప్రశ్నించారు.

రైతుల ఆందోళనలను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. వాళ్ల ఓపికను పరీక్షిస్తే దేశం భారీ మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుందని హెచ్చరి ంచారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం ప్రయోజనాలు కల్పించా లని ఉత్తరప్రదేశ్ రైతులు ఇటీవల ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇదే కార్య క్రమంలో పాల్గొన్న శివరాజ్ సింగ్ మాత్రం రైతుల ఆందోళనలపై నోరు మెదపలేదు. ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని శివరాజ్ పేర్కొన్నారు.