16 July, 2026 | 5:50 PM

శెభాష్ రతన్‌లాల్

06-06-2024 02:44 AM

కిన్నెరసానిలో మహిళను కాపాడిన సిబ్బంది

అభినందించిన డ్యాం సీఈ ప్రభాకర్‌రావు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో ఈ నెల 2న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను కాపాడిన జేపీఏ రతన్‌లాల్‌ను బుధవారం కేటీపీఎస్ సీఈ ప్రభాకర్‌రావు సన్మానించారు. జూన్ ౨న రతన్‌లాల్ డ్యాం వద్ద ఫస్ట్ షిఫ్ట్‌లో విధుల్లో ఉన్నారు. మహిళ ప్రాజెక్టులో దూకడాన్ని గమనించి ప్రాణాలకు తెగించి నీటిలో దునికి టూరిజం బోటు ద్వారా ప్రాణాలను కాపాడారు. నిండు ప్రాణాన్ని కాపాడిన రతన్‌లాల్‌ను సీఈ శాలువాతో సన్మానించి, ప్రశంస పత్రాన్ని అందించి అభినందించారు.