బండి గెలుపు..రాజన్నకు కోడెమొక్కు
06-06-2024 02:47 AM
రాజన్న సిరిసిల్ల, జూన్ 5 (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్‌కుమార్ విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవడంతో మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడంతో భారీ మెజారిటి సాధ్యమైందని స్పష్టంచేశారు.






