పాలమూరు అభివృద్ధికి డీకే అరుణ సహకారం తీసుకుంటాం
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 5 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీ డీకే అరుణ సహకారంతో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తామని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారని, ఎల్లప్పుడు వారికి పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. చాలాతక్కువ వ్యత్యాసంతో కాంగ్రెస్ ఎంపీ సీటును కోల్పోయిందని అన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి పార్లమెంట్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీని కోరారు.






