19-02-2026 01:38:16 AM
హిందూ వాహిని వరంగల్ సంయోజక్ ఛత్రపతి శివాజీ
హనుమకొండ,ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరాల్లో జయంతి ర్యాలీని,బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హిందూ వాహిని వరంగల్ సంయోజక్ ఎర్రగొల్ల చత్రపతి శివాజీ తెలిపారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చత్రపతి శివాజీ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చేస్తున్నామని, శివాజీ జయంతి శోభాయాత్ర, సాయంత్రం నాలుగు గంటలకు కాజీపేట పట్టణంలో ప్రారంభమై హనుమకొండ వరంగల్ నగరాలలో కొనసాగుతుందన్నా రు.ఈ శోభాయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్,కాజీపేట, హనుమకొండ పట్టణాల్లో ని హిందూ యు వకిశోరాలు వేలాదిగా తరలివచ్చి శోభాయాత్రను,బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్,అఖిల్ యాదవ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.