కొత్తగూడెం ప్రెస్ క్లబ్ లో షోయబుల్లా ఖాన్ వర్ధంతి
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు, అమరుడు షాయబుల్లా ఖాన్ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో షాయబుల్లా ఖాన్ చిత్రపటానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ,ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తేవడంలో షాయబుల్లా ఖాన్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పాత్రికేయ రంగంలో ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను నిర్భయంగా, వెల్లడించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫర్ గోవింద్, ఐ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ నవీన్, వెలుగు స్టాఫర్ రాజేందర్, మన తెలంగాణ స్టాఫర్ సత్య ప్రకాష్, విజన్ ఆంధ్ర స్టాఫర్ ఉమాకాంత్, వుదయం స్టాఫర్ జీవన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, జునుమాల రమేష్, రెశ్వంత్ పండుగ, రిపోర్టర్స్ ఏర్పుల సుధాకర్, కొండా జంపన్న, కవటం శ్రీనివాస్, కోల కుమార్, బిగ్ టీవీ నాగేశ్వరావు, సీవీఆర్ రమేష్, అఫ్జల్ పఠాన్ పాల్గొని షాయబుల్లా ఖాన్ సేవలను స్మరించుకున్నారు.






