దుకాణాలు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి జూన్ 28 : దళిత నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్మించిన ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాలను నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఎస్సీ దుకాణ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అన్హరులకే పెద్ద పీట వేశారని నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని అన్నారు.
న్యాయం కోసం నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. వారితో పాటు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , మాజీ జడ్పిటిసి సభ్యురాలు విజితా రెడ్డి, బారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు






