2 May, 2026 | 1:11 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

పల్లెలకు పాకిన గ్యాస్ కష్టాలు

12-03-2026 03:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు( LPG Cylinder Shortage) మొదలయ్యాయి. ఇప్పటివరకు వాణిజ్య గ్యాస్ కొరత తీవ్రంగా మారగా, తాజాగా గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. చాలా రోజులుగా తమకు గ్యాస్ కావాలని గృహ వినియోగదారులు బుక్ చేసినప్పటికీ సిలిండర్లు సకాలంలో డెలివరీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇండ్లల్లో గ్యాస్ సిలిండర్లు నిండుకోవడంతో అవసరానికి తగ్గట్టుగా సిలిండర్లు డెలివరీ ఇవ్వకపోవడంతో ఏకంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు గ్యాస్ డీలర్ స్టాక్ పాయింట్ వద్దకు గురువారం పెద్ద ఎత్తున  ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వినియోగదారులు చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డెలివరీ చేయడం లేదని కొందరు, గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేయడానికి ప్రయత్నిస్తే బుక్ కావడం లేదని, ఆన్లైన్ కాల్ సెంటర్ పనిచేయడం లేదని మరికొందరు ఆరోపించారు. తమకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటూ క్యూ కట్టారు. దీనితో ఇప్పటివరకు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లకు కొరత ఉండగా, తాజా పరిణామాలతో వంట గ్యాస్ సిలిండర్లకు కూడా డిమాండ్ నెలకొంది.