24 May, 2026 | 1:49 PM

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి

24-05-2026 12:53 PM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ చుట్టుపక్కల వీధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ఓ అనుమానితుడు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ పోలీసు అధికారులు కాల్పులు జరపడంతో అతను తీవ్ర గాయాలతో మరణించాడు. కాల్పుల సమయంలో అటుగా వెళ్తున్న మరొకరికి తూటా తగిలిందని సీక్రెట్ సర్వీస్ అధికారి తెలిపార. 

అయితే, ఆ వ్యక్తికి తగిలిన తూటాను ఎవరు పేల్చారనే విషయంపై స్పష్టత లేదు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిందితుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఏ ఒక్క అధికారి కూడా గాయపడలేదని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. శ్వేతసౌధం సమీపంలోని 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి.  15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని, ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. వెంటనే  భద్రతా బలగాలు అప్రమత్తమై వైట్ హౌస్ కాంప్లెక్స్ ను చుట్టు భారీగా మోహరించి లాక్ డౌన్ చేశారు.