24 May, 2026 | 3:23 AM

కొందరికి మినహాయింపులు

24-05-2026 01:16 AM

గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా స్పష్టత

దేశానికి లబ్ధి ఉంటుందనుకున్న దరఖాస్తులకు ప్రాధాన్యం

మిగతా వారు స్వదేశంలో దరఖాస్తు చేసుకోవాల్సిందే: ఎస్‌సీఐఎస్

వాషింగ్టన్, మే ౨౩: అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) పొందాలనుకునే వారు ఇకపై తమ స్వదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని శుక్రవారం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (ఎస్‌సీఐ ఎస్) ప్రకటించింది. అయితే.. ఈ నిబంధన కొందరికి మాత్రమేనని, తమ దేశం నుంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని తాజా గా మరో ప్రకటన విడుదల చేసింది.

గ్రీన్‌కార్డు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, దరఖాస్తుదారుల్లో ఎవరితోనైనా తమ దేశానికి ప్రయోజనం ఉందని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసిం ది. తాము గుర్తించిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయని, ఇక మిగిలిన దరఖాస్తు దారులంతా తమ స్వదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నా రు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

కొత్త విధానం భారత్‌ను ఉద్దేశించినది కాదు: రుబియో

అమెరికా గ్రీన్‌కార్డు నిబంధనల మార్పు భారతదేశాన్ని ఉద్దేశించి చేసిందని కాదని, ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. వలసల వ్యవస్థను సంస్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా తాము ఈ గ్లోబల్ పాలసీని అమలు చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. భారత పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారూ గ్రీన్‌కార్డు కోసం తమ స్వదేశాని కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను సమర్థించారు.

ట్రంప్ ప్రభుత్వం వలసల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉంద ని వెల్లడించారు. కొన్నేళ్లుగా తమ దేశం తీవ్రమైన వలసల సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నదని గుర్తుచేశారు. తమ దేశంలోకి సుమారు 2 కోట్ల మందికి పైగా అక్రమంగా ప్రవేశించారనే విషయం ఆందోళనకు గురిచేస్తున్నదని వివరించారు. గ్రీన్‌కార్డు వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇమిగ్రే షన్ విధానాలను కఠినతరం చేయాల్సి వచ్చిందని వివరించారు.