డబ్బు ఉంటే జల్సాలు చేయాలా?
22-05-2024 12:00 AM
బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో తెలు గు రాష్ట్రాలకు చెందిన వందమందికి పైగా ప్రముఖులు పట్టుబడ్డారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. పట్టుబడిన వారిలో పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు పార్టీకి రూ.30 నుంచి 50 లక్షల దాకా ఖర్చు చేసినట్లు, డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా వాడినట్లు తెలుస్తోంది. డబ్బు ఉంటే జల్సాలు చేయడమే పనా? ఇప్పుడు పట్టుబడిన వారి జీవితాలకు అది మాయని మచ్చ కాదా? గతంలో హైదరాబాద్‌లో కూడా ఇలాంటి రేవ్ పార్టీల్లో పలువురు యువతీ యువకులు పట్టుబడ్డారు. ఆ కేసులు ఏమయినాయో ఇప్పటివరకు తెలియదు.
గిరిధర్, న్యూ హేమానగర్, హైదరాబాద్






