మరో ఘరానా మోసం
22-05-2024 12:00 AM
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశ చూపి ఓ సంస్థ 500 మందికి పైగా ప్రజలను రూ.200 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నా రు. బాధితుల్లో చాలా మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి మోసాలు వందల సంఖ్యలో వెలు గు చూశాయి. వందల కోట్లు నష్టపోయిన బాధితులు వేల సంఖ్య లో ఉన్నారు. అలాంటి కథనాలు, టీవీల్లో, పత్రికల్లో రోజూ చూస్తూనే ఉంటాం, అయినప్పటికీ మళ్లీ ఎలా మోసపోతున్నారనేది అర్థం కాదు. ఇలా మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం మోసగాళ్లకు కొదువ ఉండదు.
కె కృష్ణారెడ్డి, పటాన్‌చెరు






