రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా శ్రావణ్ కుమార్
22-08-2026 10:42 PM
బడంగ్ పేట్,(విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ మోర్చ అధికార ప్రతినిధిగా శ్రావణ్ కుమార్ నియమితులైనారు. శ్రావణ్ కుమార్ నియమిస్తూ.. రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షులు కాంతి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట ఎస్సీ మోర్చ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్, నా నియమానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. పార్టీ నాపై నమ్మకంతో ఇంత పెద్ద పదవి అప్పజెప్పిన పార్టీ పెద్దల నమ్మకాన్ని మమ్ము చేయకుండా పార్టీ అధినాయకం ఆదేశాల మేరకు సూచనలు సలహాలు పాటిస్తూ.. పార్టీ మరిత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.






