23 August, 2026 | 12:19 AM

శ్రీ పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

22-08-2026 10:40 PM

శంకర్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో శుక్రవారం నుండి  శ్రీ పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. కాగా శనివారం రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరయ్యారు. జాతర ఉత్సవాలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా అన్నారు. పండుగలను ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో జరుపుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గండిచేర్ల గోవర్ధన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బద్దం శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, 6 వ వార్డు వార్డు కౌన్సిలర్ ఉష విజయ్ కుమార్ నాయకులు మహేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సత్తిరెడ్డి, కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.