30 August, 2026 | 6:33 PM

శ్రీశ్రీశ్రీ మందుముల ఐదు గుడిల పోచమ్మ తల్లి శ్రావణ మాస బోనాలు

30-08-2026 05:26 PM

రామచంద్రపురం ఆగస్టు 30: రామచంద్రపురం డివిజన్‌లోని శ్రీశ్రీశ్రీ మందుముల ఐదు గుడిల పోచమ్మ తల్లి శ్రావణ మాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నలగండ్ల నర్సింగ్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా నలగండ్ల నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.శ్రావణ మాస బోనాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.