30 August, 2026 | 8:12 PM

Breaking News

జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •  

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

30-08-2026 05:59 PM

అశ్వాపురం, ఆగస్టు 30 (విజయక్రాంతి): మండలంలోని మొండికుంట సమీపంలో  ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో మల్లెమడుగు గ్రామానికి చెందిన చల్లా వసంత్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ప్రమాదంలో మరో వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలైన చల్లా వసంత్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. మరో క్షతగాత్రుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.