calender_icon.png 20 January, 2026 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనీన్, నిక్కర్‌పై ఎస్‌ఐ విధులు!

20-01-2026 12:32:04 AM

  1. ఫిర్యాదుదారులపై దురుసు ప్రవర్తన  

బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన    

నాగర్ కర్నూల్, జనవరి19 (విజయక్రాంతి): బిజినపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ యూనిఫామ్ లేకుండా బనీన్, నిక్కర్ పైనే డ్యూటీ విధు లు నిర్వరిస్తూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపైనే దురుసుగా వ్యవహరించారు. వారిపై బెదిరింపులకు పాల్పడుతూ వీరంగం సృష్టించా రు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు బిజినపల్లి మండలం లట్టుపల్లి భీముని తండాకు చెందిన కిషన్ నాయక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

సోమవారం రాత్రి బిజినపల్లి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా వెలుగొండ కాలనీ వద్ద తాను ప్రయాణిస్తున్న ఆటోను వెనకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో గాయపడి 108ని ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాజేంద్రప్రసాద్, రవి, భాస్కర్, ఉదయ్ తదితరులు బిజినపల్లి స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. తనను వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులను కోరారు.

దీంతో మేమేం చేయాలో మీరే చెప్తారా అంటూ యువకులపై సదరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్‌ఐ యూనిఫాం లేకుండా బనీన్ నిక్కర్ పైనే వచ్చి బాధితులను బెదిరిస్తూ దాడికి యత్నించాడు. ఫిర్యాదు చేసేందుకు వస్తే దాడి చేస్తారా అంటూ బాధితులు ప్రశ్నించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ మేరకు బాధితులు ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాసులను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.