22 April, 2026 | 11:33 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

డిఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన ఎస్సై...

31-03-2025 07:46 PM

అభినందించిన యువకులు...

గుడిహత్నూర్ (విజయక్రాంతి): గ్రూప్-1 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిహత్నూర్ ఎస్సై కరాండే మహేందర్ డీఎస్పీగా ఎంపికైయ్యారు. దీంతో సోమవారం రత్న సాన్వి వెల్ఫర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఉప్పారపు సత్యరాజ్ ఎస్ఐ ని కలిసి అంబెడ్కర్ చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ... పట్టుదల, ఏకాగ్రతతో చదివి డిఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన ఎస్సై మహేందర్ ను పలువురు యువకులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమరేశ్వర్, సతీష్, రాహుల్, గణేష్, అశోక్, రాంకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.