22 March, 2026 | 1:43 AM

ఆయిల్ పామ్ హబ్‌గా సిద్దిపేట

22-03-2026 12:13 AM
  1. నర్మెట్టలో దేశంలోనే తొలి మలేషియా టెక్నాలజీతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
  2. రూ.300 కోట్లతో 62 ఎకరాల్లో నిర్మాణం
  3. వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ తయారీ 
  4. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

నంగునూరు, మార్చి 21: ఒకప్పుడు ఆయిల్ పామ్ సాగుకు ఆమడ దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా నేడు దేశంలోనే అత్యం త ఆధునికమైన మలేషియా టెక్నాలజీతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నిలయంగా మారింది. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామ శివారులో రూ.300 కోట్ల వ్యయం తో, 62 ఎకరాల్లో నిర్మించిన ఈ కర్మాగారా న్ని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునికత సాంకేతికతతో ఫ్యాక్టరీని రూపొందించారు. ఈ ఫ్యాక్ట రీ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, సాంకేతిక విప్లవం. దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. ప్రారంభంలో గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యంతో మొదలై, భవిష్యత్తులో దీనిని 120 టన్నుల వరకు పెంచేలా మౌలిక సదుపాయాలను కల్పించారు.

రాష్ర్టంలోని ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేటలో గంట కు 30 టన్నులు, అప్పారావు పేటలో 90 టన్నుల సామర్థ్యంతో పరిశ్రమలు న్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ను రాజేంద్రనగర్ ఆయిల్ ఫెడ్‌కు పంపించి అక్కడ రిఫైన్డ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపించేవారు. కానీ, నర్మెట్ట ఫ్యాక్టరీలో తొలిసారిగా రిఫైనరీ యూనిట్‌దీతిజిజిను అనుసంధానించారు.

గెలల నుంచి నూనె తీయడం, దానిని శుద్ధి చేయడం, ప్యాకింగ్ చేయడం అన్నీ ఇక్క డే జరుగుతాయి. అంటే పొలం నుంచి వచ్చే గెలలు నేరుగా ప్యాకెట్లోకి మారి మార్కెట్లోకి వెళ్తాయి. అందుకు రూ. 40 కోట్లతో నిర్మించనున్న భారీ ప్యాకింగ్ యూనిట్ (గంటకు 250 టన్నులు)ను ముఖ్యమంత్రి అదే రోజు శంకుస్థాపన చేయనున్నారు.

వ్యర్థాల నుంచి విద్యుత్

గెలల నుంచి నూనె తీశాక మిగిలే బయోమాస్ వ్యర్థాల ద్వారా 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. యూనిట్‌కు కేవలం రూ.1.50 ఖర్చుతో తయారయ్యే ఈ కాలు ష్య రహిత విద్యుత్తు ఫ్యాక్టరీ అవసరాలకు సరిపోతుంది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే నీటి ని అత్యాధునిక పద్ధతుల్లో రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించేలా తెలంగాణలోనే తొలి ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ ప్లాంట్‌గా దీనిని తీర్చిదిద్దారు.

ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించనుంది. సిద్దిపేటతో పాటు జనగామ, మహబూబాబాద్, గద్వాల్ రైతులకు కూడా ఈ కేంద్రం కీలకం కానుంది. రాష్ర్టంలో ఇప్పటివరకు 2.90లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కాగా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 4,379 మంది రైతులు 14,290 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.