సింగరేణిలో సిక్కం శ్యాంసుందర్ గానం కు నల్ల వజ్రం అవార్డు
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్యామ్ సుందర్ గానానికి మరియు నటన ను గుర్తించి ఎన్నో అవార్డులను రివార్డులను పొందిన సిక్కం శ్యాంసుందర్ కు నల్ల వజ్రం అనే అవార్డుతో సత్కరించడం జరిగింది.సింగరేణి కంపెనీ స్థాయి మరియు కోల్ ఇండియా స్థాయిలో జరిగే సాంస్కృతిక పోటీలలో ఎన్నోమార్లు గోల్డ్ మెడల్స్ సాధించడం, అక్షరజ్ఞానం, ఎయిడ్స్, పచ్చదనం పరిశుభ్రత మీద గత 38 సంవత్సరముల నుండి సింగరేణి కంపెనీ నిర్వహించేటువంటి సేఫ్టీ కార్యక్రమాలపై వీధి నాటకాల ద్వారా కార్మికులను వారి కుటుంబాలను చైతన్యవంతులను చేయడానికి సిక్కం శ్యాంసుందర్ పాత్ర మరువలేనిది.
కావున వీరి గానానికి మరియు నటనకు గుర్తింపుగా గోదావరిఖని తారా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంకె రాజేష్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో సిక్కం శ్యాంసుందర్ ని పూలమాలతో శాలువాతో నల్ల వజ్రం అనే అవార్డుతో సన్మానించడం జరిగింది.. ఈ అవార్డును అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ అవార్డును ప్రధానం చేసిన సంక రాజేష్ ను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




