3 July, 2026 | 8:18 PM

మలేషియా మాస్టర్స్ రన్నరప్ సింధు

27-05-2024 01:28 AM

కౌలాలంపూర్: తెలుగు తేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21 5 16 వాంగ్ జి (చైనా) చేతిలో ఓడింది. మలేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గి రెండేళ్ల నిరీక్షణకు తెర దించాలని భావించిన సింధూకు నిరాశే ఎదురైంది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్కో ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ వచ్చిన సింధూ ఈసారి టైటిల్ కచ్చితంగా గెలుస్తుందనుకున్నప్పటికీ తుదిపోరులో తెలుగమ్మాయికు ఓటమి తప్పలేదు. 79 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సులువుగానే సొంతం చేసుకున్న సింధూ అదే జోరును తర్వాత కొనసాగించడంలో విఫలమైంది.ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 16 వాంగ్ జి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచింది.