3 July, 2026 | 7:21 PM

అల్కరాజ్ బోణీ

27-05-2024 01:43 AM

సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. మట్టికోట మహరాజు రాఫెల్ నాదల్ దారిలోనే నడుస్తున్న అల్కరాజ్.. తొలి రౌండ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అల్కరాజ్‌తో పాటు.. హుర్కాజ్, దిమిత్రోవ్, రూబ్లేవ్ ముందంజ వేయగా.. మహిళల సింగిల్స్‌లో నవోమీ ఒసాకా, ఓస్టపెంకా శుభారంభం చేయగా.. నేడు నాదల్, ఇగా స్వియాటెక్ బరిలోకి దిగనున్నారు. 

 ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో అల్కరాజ్ 6 6 6 అమెరికాకు చెందిన జె.జె వోల్ఫ్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించిన ఈ స్పెయిన్ యువ కెరటం తన ప్రత్యర్థిని వరుస సెట్లలో ఖంగుతినిపించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి పోరులో ఐదు ఏస్‌లు కొట్టిన అల్కరాజ్.. 9 బ్రేక్ పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో రష్యా స్టార్ ఆండీ రుబ్లేవ్ 6 6 6 7 డానియెల్‌పై (జపాన్), దిమిత్రోవ్ (బల్గేరియా) 666 కొవాసెవిక్ (అమెరికా)పై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో జపాన్ టెన్నిస్ స్టార్ నయామి ఒసాకా, జెలీనా ఓస్టపెంకాలు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఒసాకా 647  బ్రోన్‌జెట్టిపై గెలవగా.. ఓస్టపెంకా 67 క్రిస్టియాన్‌పై నెగ్గింది. ఇప్పటికే 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్టార్ ప్లేయర్ నాదల్ నేడు తొలి రౌండ్‌లో జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. ఇక భారత నుంచి సుమిత్ నాగల్ సోమవారం తనకంటే ఎన్నో ర్యాంకులు మెరుగైన రష్యా స్టార్ కచనోవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.