దీపా కర్మాకర్‌కు పసిడి
ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్
తష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. 21 నెలల నిషేధం అనంతరం తొలిసారి బరిలోకి దిగిన దీపా ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో అదరగొట్టింది. పోల్ వాల్ట్ ఈవెంట్‌లో స్వర్ణంతో మెరిసిన దీపా.. ఈ టోర్నీలో భారత్ తరపున స్వర్ణం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా రికార్డుల్లోకెక్కింది. తష్కెంట్ వేదికగా ఆదివారం జరిగిన పోల్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో దీపా కర్మాకర్ పూర్తి రౌండ్లు ముగిసేసరికి 13.566 స్కోరుతో అగ్రస్థానం దక్కించుకొని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సోన్ యాంగ్ (13.466), జో యోంగ్ (12.966) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక దీపా కర్మాకర్ 2016 రియో ఒలింపిక్స్‌లో పోల్ వాల్ట్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో దీపా 21 నెలల నిషేధం ఎదుర్కోవడంతో పారిస్ ఒలింపిక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది.






