29 May, 2026 | 2:34 AM

క్వార్టర్ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్

29-05-2026 12:00 AM

సాత్విక్ ధృవ్ ముందంజ

సింగపూర్ ఓపెన్

సింగపూర్, మే 28: సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల డబుల్స్‌లో చిరాగ్ షెట్టి సా యిరాజ్ , మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల జోడీ క్వార్టర్ ఫైవల్‌కు దూసుకెళ్లారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు ప్రీ క్వార్టర్స్‌లో అదరగొట్టింది.

జపాన్‌కు చెందిన రికో గుంజిపై 21 21 స్కోరుతో విజ యం సాధించింది. పూర్తి ఆధిపత్యం కనబరిచిన సింధు కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో సింధుకు అసలైన ఛాలెంజ్ ఎదురుకాబోతోంది.  ఒలింపిక్ ఛాంపియన్, వరల్డ్ నెం.1 అన్ సియంగ్‌తో సింధు తలపడనుంది. ఆ మెతో ఇప్పటి వరకూ 8 సార్లు తలపడగా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అటు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ముందంజ వేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతని ప్కత్యర్థి థాయ్‌లాండ్‌కు చెందిన కున్‌లాట్ గాయంతో తప్పుకున్నాడు.

లక్ష్యసేన్ తన త ర్వాతి మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ కొకి వతనాబేతో తలపతాడు. కాగా పురుషుల సింగిల్స్ లో హెచ్‌ఎస్ ప్రణయ్ 18 21 15 1స్కోరుతో కీల్ యో చేతిలో పరాజ యం పాలయ్యాడు. ఇదిలా పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. హో రాహోరీ పోరులో సాత్విక్ జోడీ 21 11 21 స్కోరుతో లీ జీహు, యాంగ్ జోడీపై విజయం సాధించింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీ క్వార్టర్స్‌లో మలేషియాకు చెఎందిన కాంగ్ కాయ్ జింగ్ థాయ్‌తో తలపడతారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల తనీ శా జోడీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత జంట 8 స్కోరుతో జపాన్ జోడీ యుట వటనాబె, మాయా టగుచిపై విజయం సాధించింది.