29 May, 2026 | 1:41 AM

సిన్నర్ ఔట్

29-05-2026 12:00 AM

మాన్యుయేల్ సంచలనం

పారిస్, మే 28 : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్, టాప్ సీడ్ జెన్నిక్ సిన్నర్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఊహించని విధంగా అన్‌సీడెడ్ అర్జెంటీనా యువ ఆటగాడు జు వాన్ మాన్యుయేల్ సిన్నర్‌ను ఓడించాడు.

ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 6 5 స్కోర్‌తో మాన్యూయేల్ చేతి లో సిన్నర్ ఓడిపోయాడు. విపరీతమైన ఎం డవేడిమిని తట్టుకోలేకపోయిన సిన్నర్ పదే పదే బ్రేక్ తీసుకున్నా అలసటకు గురై తప్పిదాలు చేశాడు. అలాగే జర్మనీకి చెందిన 2వ సీడ్ జ్వెరేవ్ 6- 6 6- టి.మచాక్(చెక్)ను, రూడ్(నార్వే) 6- 6- 6 మెడ్జెడోవిచ్(సెర్బియా)ను వరుససెట్లలో చిత్తుచేశారు. ఇక మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో 10వ సీడ్ ముఛోవా(చెక్), 16వ సీడ్, ఒసాకా(జపాన్) సునాయాసంగా గెలిచి మూడోరౌండ్ కు చేరారు.

ముఛోవా 6- 6 రఖీమోవా(ఉజ్బెకిస్తాన్)ను, ఒసాకా 7 6 వేకిచ్(క్రొయేషియా)ను ఓడించారు. ఇక 17వ సీడ్ ఇవి య(అమెరికా) 6- 6- తన దేశానికే చెందిన నవ్వారోను ఓడించి మూడోరౌండ్‌కు చేరింది. ఇతర పోటీల్లో 22వ సీడ్, రష్యాకు చెందిన కనస్కియా 7- 6- సహచర క్రీడాకారిణి అలీనా కోర్నీవాపై, 6వ సీడ్ అమెరికాకు చెందిన అనిసిమోవా 6- తొలి సెట్ గెలుచుకున్న అనంతరం ప్రత్యర్ధి గ్రాబర్(ఆస్ట్రియా) గా యంతో వైదొలిగింది.