30-12-2025 09:11:44 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సింధు విద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జగన్ తెలిపారు. సింధు విద్యాలయం హై స్కూల్ కు చెందిన జె.అస్మిక (పదవ తరగతి) 22 మార్కులు సాధించినట్లు, అలాగే సాయి ప్రియ (9వ తరగతి), సుమిత్ (8వ తరగతి)లు 15 మార్కులు సాధించి, ఉత్తమంగా నిలిచారని వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రియాంక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.