16 April, 2026 | 1:25 AM

వందేమాతరం గీతం ఆలపించి.. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు

07-11-2025 09:25 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): స్వతంత్ర పోరాటంలో భాగంగా బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గేయం, ఈరోజు  150 సంవత్సరాలు పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఎందరో మహానుభావుల, త్యాగాలను, ధైర్యసాహసాలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసుందర్రావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.