16 April, 2026 | 1:26 AM

కల్హేర్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎ.రవి గౌడ్

07-11-2025 09:28 PM

కల్హేర్(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల నూతన ఎస్సైగా ఎ.రవి గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు సదాశివ పేట్  ఎస్సైగా విధులు నిర్వహించారు. కల్హేర్ ఎస్సైగా ఉన్న మధుసూదన్ రెడ్డి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై ఎ.రవి గౌడ్ మాట్లాడుతూ... మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ..మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వివరించడం జరుగుతుందని వారు తెలియజేశారు.