26 June, 2026 | 2:25 AM

‘ఎస్‌ఐఆర్’ను విజయవంతం చేయాలి

26-06-2026 01:19 AM

ఇటిక్యాల, జూన్ 25: మండలంలో ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం తహశీల్దార్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఓటర్ల నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ జీవేందర్ రెడ్డికి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మునుగాల సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, బీఎల్వో నాగేంద్రమ్మ, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.