సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం
05-05-2026 06:33 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు బాధ్యతలు చేపట్టింది. చైర్మెన్ బండి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, వారి అవసరాలకు తక్షణ స్పందన అందిస్తూ సేవలందిస్తామని తెలిపారు.






