5 May, 2026 | 7:50 PM

ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం

05-05-2026 06:37 PM

ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అర్హులు

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని రామవరం లో గల, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ నందు, ఈ విద్య సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన బాల బాలికలు, పదకొండవ తరగతి సీబీఎస్ఈ లో  చదువుకొనుటకు, ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులు, ఎంపీసీ, బైపిసి, సిఇసి పలు గ్రూపులలో ఆసక్తి కళా విద్యార్థిని విద్యార్థులు, ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అర్హులని తెలియజేస్తూ, ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తులను ఈఎంఆర్ఎస్ రామవరం పంజాబ్ గడ్డ నందు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు, ఈఎంఆర్ఎస్ రామవరం నందు దరఖాస్తు ఫారం ను పొంది, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను ఈనెల 15వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది .పూర్తి వివరాలకు ఈ.ఎం.ఆర్.ఎస్ ప్రిన్సిపల్   ( 8 2 7 7 0 2 0 0 5 7) ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు.