28 June, 2026 | 12:05 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ అంతటా మోగిన సైరన్లు

21-03-2026 02:55 PM

టెహ్రాన్: 22 రోజులుగా దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్(Israel-America-Iran War) పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. లెబనాన్ లోని హెజ్ బోల్లాపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాన్ ఉదయం ఇజ్రాయెల్ పైకి భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్(Iran strikes) దాడులతో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. జెరూసలెం, టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సూచించాయి.