28 June, 2026 | 12:29 PM

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

28-06-2026 11:58 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని,  0-5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా  పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతుందన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం, పోలియోరహిత భారతదేశం కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.