24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

కోల్‌కతా లా కాలేజీ ఘటనపై ‘సిట్’ ఏర్పాటు

29-06-2025 02:11 AM
  1. ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందం 
  2. పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు
  3. రెండో రోజు వెల్లువెత్తిన నిరసనలు

కోల్‌కతా, జూన్ 28: దక్షిణ కోల్‌కతాలోని కస్బా ‘లా’ కాలేజీ విద్యార్థిని గ్యాంగ్ రేప్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృం దాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు కోల్‌కతా పోలీస్ అధికారులు తెలిపారు. సమగ్ర దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో కూడిన బృందానికి అసిస్టెంట్ ర్యాంక్ అధికారి సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థినిపై అత్యాచార కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా శనివారం కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీని అరెస్టు చేశారు.

విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన సమయంలో పరిసరాల్లోనే ఉన్నప్పటికీ తన బాధ్యత నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో పినాకి బెనర్జీని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేప ట్టారు.

ఘటనపై లా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం భారీ ర్యాలీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు లా కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బారీకేడ్లు పెట్టి పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే బుధవా రం రాత్రే విద్యార్థినిపై అత్యాచార ఘటన జరిగిందని, త్వరలో జరగనున్న పరీక్షల కోసం అప్లికేషన్ పూర్తి చేయడానికి ఆమె కాలేజీకి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఇక వైద్యుల పరీక్షలో తాజాగా విద్యార్థిని మెడ, ఛాతీ భాగా ల్లో గుర్తులున్నట్టు బయటపడింది.