3 July, 2026 | 9:29 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

ఎంపీ కారు డ్రైవర్‌కు 150 కోట్ల బహుమతి

29-06-2025 02:13 AM
  1. శిండే సేన వర్గానికి చెందిన ఎంపీ సందీపన్ డ్రైవర్‌కు మూడెకరాల గిఫ్ట్

దర్యాప్తు చేస్తున్న ఈవోడబ్ల్యూ

ముంబై, జూన్ 28: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఓ ఎంపీ కారు డ్రైవర్‌కు నిజాం దివాన్ వారసు లు రూ.150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని బహుమతిగా ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లంచం గురించి ఓ న్యా యవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించా రు.

షిండే వర్గానికి చెందిన ఎంపీ సందీపన్ భుమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలా స్ వద్ద రసూల్ షేక్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆ డ్రైవర్‌కు చత్రపతి శంభాజీనగర్‌లో నివాసం ఉంటున్న నిజాం దివాన్ వారసులు రూ. 150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఈ వ్యవహారంపై ముజాహిదిన్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం అధికారులు (ఈవోడబ్ల్యూ) దర్యాప్తు ప్రారంభించారు.

రసూల్ షేక్ సదరు ఎంపీ దగ్గర 13 ఏండ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్రైవర్‌కు గిఫ్ట్‌గా ఇ చ్చిన భూమిపై దివాన్ వారసులు ఎన్నో ఏ ండ్లపాటు న్యాయపోరాటం చేసి 2022లో దక్కించుకున్నారని,

అటువంటి భూమిని ఎ టువంటి రక్తసం బంధం లేని వ్యక్తికి ఎలా ఇ స్తారని ముజాహిదీన్‌ఖాన్ ఫిర్యాదులో ప్ర శ్నించారు. దివాన్ వారసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే భూమిని గిఫ్ట్‌డీ డ్ చే శారని డ్రైవర్ తెలిపినట్టు సమాచారం. పోలీసులు ఈ విషయంపై తనను కూడా సం ప్రదించారని ఎమ్మెల్యే విలాస్ తెలిపారు.