calender_icon.png 29 June, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా జెఫ్ బెజోస్ రెండో పెళ్లి

29-06-2025 02:09:34 AM

  1. తన ప్రేయసి లారెన్‌తో ఏడడుగులు
  2. వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహం
  3. అనేక మంది హలీవుడ్ ప్రముఖుల రాక

వెనిస్, జూన్ 28: అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ అపరకుబేరుడు జెఫ్ బెజోస్ (61) తన ప్రియురాలు, మాజీ న్యూస్ యాం కర్ లారెన్ శాంచెజ్  (55)ను శుక్రవారం వివాహం చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి వార్తలను లారెన్ శుక్రవారం పొద్దుపోయిన తర్వాత ధ్రువీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకుంది. ఈ వివాహ వేడుకకు అనేక మంది హలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఇట లీ మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం వెని స్ నగరంలోని చారిత్రక సెయింట్ మార్క్స్ కు ఎదురుగా ఉన్న శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో ఈ జంట ఒక్కటైంది. ఆ ద్వీపంలో బ్లాక్ థీమ్‌తో పెళ్లి వేడుకను నిర్వహించారు. పెళ్లి సందర్భంగా లారెన్ తెలుపు రంగు గైనులో మెరవగా.. బెజోస్ నలుపు రంగు సూట్‌లో దర్శనం ఇచ్చారు.

ఈ పెళ్లి వేడుక కోసం దాదాపు 200 మంది అతిథులు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటి యో బోసెల్లి గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పెళ్లి అనంతరం లారెన్ శాంచెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేరును లారెన్‌శాంజెచ్‌బెజోస్‌గా మార్చుకుంది.