17 April, 2026 | 11:00 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు అరెస్ట్, 33 బైకులు స్వాధీనం

28-06-2025 12:00 AM

 కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 

కరీంనగర్ క్రైం,జూన్27(విజయక్రాంతి):కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుండి మొత్తం 33 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం శుక్రవారం తెలిపారు.

రీంనగర్ టూ టౌన్ పరిధిలోని పద్మనగర్లో టూ టౌన్ మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు మోటార్ సైకిళ్ళపై ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వీరు కరీంనగర్ కమీషనరేట్ మరియు సిరిసిల్ల జిల్లా పరిధిలో మొత్తం 12,27,000 రూపాయల విలువగల, 33 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు తేలింది.

ఈ దొంగతనాలకు సంబంధించి మొత్తం ఆరు పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమీషనర్ వెల్లడించారు.కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 06 కేసులలో 11 బైక్లు స్వాధీనం.కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్: 08 కేసులలో 09 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్: 01 కేసులో 01 బైక్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్: 02 కేసులలో 02 బైక్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్: 03 కేసులలో 03 బైక్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్: 02 కేసులలో 02 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులుపంతుల నవీన్ (24) - మహబూబ్నగర్ జిల్లా, వెంకిచర్ల నివాసి.పెంటి బాలు (24) కరీంనగర్ జిల్లా, గన్నేరువరం, చొక్కారావుపల్లె నివాసి.,పెద్ది నాగరాజు (29) - సిరిసిల్ల జిల్లా, చందుర్తి, మల్యాల నివాసి. చిందం సాయి ప్రసాద్ (24) - ముత్తారం మంథని మండలం, కేశినపల్లి గ్రామ నివాసి. తోట మధు (28) - కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, లింగంపల్లి గ్రామ నివాసి. కుంబాల సురేష్ (35) - సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట నివాసి.

ఈ అరెస్టులతో మోటార్ సైకిల్ దొంగతనాలకు అడ్డుకట్ట పడిందని, ప్రజలు తమ వాహనాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్ సూచించారు.. నిందితులను పట్టుకుని, దొంగిలించబడిన 33 బైకులు స్వాధీనం చేయడంలో కృషి చేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి , టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి , సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోటేశ్వర్ వన్ టౌన్, జాన్ రెడ్డి త్రీ టౌన్ మరియు ఇతర సిబ్బందిని పోలీసు కమీషనర్ రివార్డు అందజేసి ప్రత్యేకంగాఅభినందించారు.