17 April, 2026 | 11:53 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

డాక్టర్ భూమ్‌రెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలి

28-06-2025 12:00 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కరీంనగర్, జూన్27(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలువురిని పరామర్శించారు ముందుగా జాగృతి నాయకులు జాడి శ్రీనివాస్ నివాసానికి వెళ్ళారు అక్కడ బిసి సంఘాల నాయకులతో మరియు జాగృతి సభ్యులతో కలిసారు అనంతరం డాక్టర్ భుంరెడ్డి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

అనంతరం గండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ ఇటీవల మరణించారు వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు బిసి సంఘాల చాలా చురుకుగా సంపత్ పాల్గొన్నారని వారి కుటుంబానికి అండగా ఉంటాను అని వారు అన్నారు అదేవిధంగా డాక్టర్ భుంరెడ్డి నివాసం మాట్లాడుతూ తెలంగాణ లోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూంరెడ్డి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరారు.

కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారికి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స చేసిన డాక్టర్ భూమ్ రెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్ వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమ్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు.