24 June, 2026 | 1:26 PM

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

14-06-2024 11:25 AM

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో శుక్రవారం దారణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ కామాందుడు అత్యాచారం, ఆపై హత్య చేశాడు. నిందితుడిని యూపీకి చెందిన బలరాం అమాలిగా గుర్తించారు. గురువారం రాత్రి రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను నిందితుడు బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసి చిన్నారి చంపేశాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. విషయం తెలుసుకున్న రైస్ మిల్లు కార్మికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.