World Blood Donor Day: రక్తదాన అవగాహన ర్యాలీ
రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): ప్రపంచ రక్త దాతల దినోత్సవం రాజన్న సిరిసిల్ల వేములవాడలోఆధ్వర్యంలో రక్త దాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణా రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రక్త దానానికి దాతలు ఉత్సహంగా నిర్భయంగా ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్త దానంపై అవగాహన కలిగి వుండి రక్త దానం చేయాలి అని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యంగా వున్న స్త్రీ పురుషులు ప్రతీ మూడు నెలల కు ఒక్కసారి రక్త దానం చేయొచ్చు అని తెలిపారు. ఎలాంటి అపోహలు వున్నా డాక్టర్ ని సంప్రదించి రక్త దానం చేయాలన్నారు. రక్తదానం వల్ల అనేక రకాల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని రక్త దానం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. రక్తానికి రక్తమే ప్రత్యామ్నాయం కాబట్టి ముఖ్యంగా యువత రక్త దానానికి ముందుకు వచ్చి ఆపద సమయంలో వున్నవారికి రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలి యువత ను కోరారు. అనంతరం ప్రజలకు రక్త దానం మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు,యువ ఫౌండేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






