24 June, 2026 | 2:37 PM

Breaking News

అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •  

కారుకు దూరం.. కాంగ్రెస్‌కు దగ్గర!

14-06-2024 01:51 AM
  • అధికార పార్టీతో బీఆర్‌ఎస్ నేతల అనుబంధం 

కారు దిగేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు 

పంచాయతీ ఎన్నికల సాగదీతతో వెనుకడుగు

అధికార పార్టీ నేతలతో మాటామంతి కొనసాగింపు

ఏ క్షణమైనా గోడ దూకేందుకు సిద్ధం

మహబూబ్‌నగర్, జూన్ 1౩(విజయక్రాంతి): గడిచిన పార్లమెంట్ ఎన్నికలు కారు పార్టీకి మరింతగా కష్టం తీసుకువచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కారు గుర్తుకు అశించిన మేరకు ఓటర్ల అదారణ రాకపోవడంతో కారు దిగేందుకు కార్యకర్తలు సన్నధ్ధం అవుతున్నారు. ఇప్పటికే గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటున్న కార్యకర్తలకు ఎంపీ ఎన్నిక ఫలితం ఆశించిన మేరకు దూరంగా ఉండడంతో ఒక్క సారిగా కారు కార్యకర్తలకు చేధు అనుభవం మిగిలిచ్చింది. స్థానిక సంస్థల ఎన్ని కల్లో విజయం సాధించడంతో ఒక్క సారిగా ఊపు మీదకు వచ్చిన కారు పార్టీకీ ఎంపి ఎన్నికల ఫలితాలు చేధు అనుభవం మిగల్చడం జరిగింది. దీంతో కారు దిగేందుకు కార్యకర్తలు సిద్దం అవుతుండ్రు. వారి బెర్త్‌ల ను కన్ఫర్మ్ చేసుకుంటు రాబోయే ఎన్నికలకు గిప్పటి నుంచే అంచనలు వేసుకుంటుండ్రు. 

పక్కా ప్రణాళికతో బీజేపీ పాగా

మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ క్యాడర్‌కు ఎంపీ ఎనికల్లో గెలు పు రుచి చూడడంతో నూతన ఉత్సహాంతో బీజేపీ క్యాడర్ ఉంది. దీంతోపాటు కేంద్ర క్యాబినెట్‌లో ఎంపీ డీకే అరుణకు ఆశించిన మేరకు గుర్తింపు వస్తుందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ క్యాడర్ భావిస్తోంది. దీంతో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో బీజేపీ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తూ ప్రతి పనిలోను పరిపక్వతతో ముందుకు సాగే అలోచనలో క్యాడర్ పక్కా అలోచన చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో గతంలో బీజేపీ పార్టీ నుంచి చాలా ప్రాంతాల్లో దూరంగా ఉండే స్థానాలే అధికంగా ఉండేవి.

జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల్లోను బీజేపీ క్యాడర్ తరుపున అభ్యర్థులను అత్యధికంగా బరిలో దింపే ప్లాన్‌లో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజం అయితే ఇటు బీఆర్‌ఎస్, బీజేపీ, అధికార కాగ్రెస్ పార్టీ మధ్య త్రిముఖ పోటీ మరింత బలంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ గెలుపుకు బీఆర్‌ఎస్ ఎంతో శ్రమించిందని ఆరోపనలు ఉన్నాయి. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నడంతో ఈ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు బరిలో ఉండడం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కల్గించే అంశం మారుతుంది. దీంతో బీజేపీ మునుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలం పెంచుకునే పరిస్థితులు మెండుగ దర్శనమిస్తున్నాయి. 

ఐదేండ్ల భవిష్యత్తే ముఖ్యమంటున్న కార్యకర్తలు

ఐదేడ్ల పాటు ప్రతిపక్షం లో ఉండేందుకు కార్యకర్తలు ఆయిష్టత ను వ్యక్తం చేస్తుండ్రు. 2029 జరుగున్న ఎన్నికల్లో అప్పటికి నియోజకవర్గాల పెంపు కూడ ఇప్పటి నుంచే ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండి రాజకీయం చేసేదానికంటే అధికారంలో ఉండే పార్టీలో ఉండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదవులను తీసుకుని ప్రజల్లో ఉండడం మేలు అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతుండ్రు. ఈ విషయాలను అందిపుచ్చుకున్న ప్రతిపక్ష కార్యకర్తలు అధికార పార్టీ నేతలు అందుబాటులో ఉంటు వారి బెర్త్‌లను ఇప్పటికే పలువురు ఖాయం చేసుకుండ్రు. ఎంపి ఎన్ని కల ఫలితాల వరకు నిరీక్షించి ఆ తరువాత నేరుగా అధికార పార్టీలోకి వచ్చే లా ప్రణాళికలు చేసుకున్నారు. దీనికి తోడు పంచాయాతీ ఎన్నికలు వాయిదా అనే వార్తాలు చెక్కర్లు కొట్టడంతో అధికార పార్టీలోకి వచ్చే కార్యకర్తలు కాస్త చూసి చూసి వచ్చేలా ప్రణాళికలు రచిస్తుండ్రు.