15 July, 2026 | 5:53 AM

ప్రేమ, భావోద్వేగాల ‘ఎస్‌కే30’

20-06-2024 12:05 AM

సందీప్ కిషన్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘ధమాకా’ వచ్చింది. మరోమారు వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ తాజా చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాకపోవటంతో ‘ఎస్‌కే 30’గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీ స్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రేమ, భావోద్వేగాల సమ్మిళితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్‌ను విభిన్నమైన అవతార్‌లో చూపించబోతున్నారని చిత్రవర్గాలు తెలిపాయి. మిగతా తారాగణం గురించి వివరాలేమీ ప్రకటించని మేకర్స్ ప్రస్తుతానికి రావు రమేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్; కథ స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్  బెజవాడ; డీవోపీ: నిజార్ షఫీ; సహ నిర్మాత: బాలాజీ గుత్తా.