12 June, 2026 | 2:35 AM

రూ.450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్

12-06-2026 01:42 AM
  1. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  2. గుండ్లపల్లి వద్ద కాల్వ లైనింగ్ పనుల పరిశీలన 

నల్లగొండ, జూన్ 11 (వి8జయక్రాంతి) : ఎస్‌ఎల్ బిసి కాలువ లైనింగ్ పనులను రూ.450 కోట్లతో చేపడుతున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురు వారం నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎస్‌ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ లైనింగ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు. వ్యవసాయ రంగాభివృద్ధి, నీటి వనరుల సమర్థ వినియోగం కోసం ప్ర భుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

కాలు వ లైనింగ్ పనులు పూర్తయితే చివరి భూ ముల వరకు రైతాంగానికి సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సీఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ బద్రు నాయక్, ఈఈ నెహ్రూ, డిఈ జితేందర్, ఏఈ గౌతమి,జేఈ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, గుండ్లపల్లి సర్పంచ్ వంగూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు