21 March, 2026 | 6:46 AM

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాలు షురూ

21-03-2026 01:51 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీతో పాటు, డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాం చ్ కెనాల్ పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రెండు వైపులా తవ్వకాలు ప్రారంభం అయినందున ఇకపై నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాంగ నిలువనున్న ఈ ప్రాజెక్ట్ తవ్వకాలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.