07-12-2025 03:36:22 PM
న్యూఢిల్లీ: భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సంగీత స్వరకర్త, గాయకుడు పలాష్ ముచ్చల్‌తో తన వివాహాన్ని రద్దయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని స్టార్ బ్యాటర్ అభిమానులు, మీడియాను కోరారు. గాయకుడు పలాష్ ముచ్చల్‌తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి కొన్ని అనుకొని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వారి వివాహం పూర్తి రద్దయినట్లు మందనతో పాటు ముచ్చల్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
భారతదేశపు ప్రముఖ మహిళా క్రికెటర్లలో ఒకరైన మంధాన, గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని, దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను, కానీ వివాహం రద్దు చేయబడిందని నేను స్పష్టం చేయాలని మంధాన రాసింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని తను కోరుకుంటున్నట్లు తెలిపారు. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి, ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని అభిమానులను అభ్యర్థించారు. భారతదేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవడం కొనసాగించడమే తన లక్ష్యమని మంధాన అన్నారు. తనకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.